'అభివృద్ధికి అందరూ సహకరించాలి'
VKB: గ్రామల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని రాంనగర్ సర్పంచ్ రుక్కి బాయి కోరారు. మండలంలోని రాంనగర్ పంచాయతీ సూర్యానాయక్ తండా హనుమాన్ దేవాలయం నుంచి నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను పంచాయతీ కార్యదర్శితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రయ్య నాయక్, నాయకులు రాంచంద్రయ్య, కిస్టయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.