ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన మదనపల్లె ఎమ్మెల్యే

అన్నమయ్య: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా పర్యటనలో భాగంగా హార్సిలీ హిల్స్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇందులో భాగంగా మదనపల్లె జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాల అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయనతో కలిసి అల్పాహారం స్వీకరించారు.