ఈ నెల 2న మహిళా ఆరోగ్య శిబిరం

MNCL: వికాస తరంగిణి చెన్నూర్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ శనివారం సాయిరాం ఫంక్షన్ హాల్‌లో మహిళల కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. శిబిరంలో గర్భకోశ వ్యాధులపై అవగాహన, వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి. అవసరమైన వారికి మందులు పంపిణీ చేయనున్నారు. చెన్నూర్, పరిసర ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.