రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. పహల్గామ్ దాడిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని వెల్లడించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలపాలని ఈ సందర్భంగా పేర్కొంది.