పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
HNK: ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ పులి రమేష్ తెలిపారు. కేశవపూరు గ్రామానికి చెందిన ఈర నరేశ్ మూడు సంవత్సరాలుగా యువతిని పెళ్లి పేరుతో మోసం చేస్తున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం రాత్రి నరేశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.