చందనోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్ష

చందనోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్ష

VSP: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను ఆలయ ఈవో జె. వెంకటరావు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, క్యూ లైన్లలో చలువ పందిళ్లు, తాగునీటి వంటి సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేయాలన్నారు.