రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

కోనసీమ: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం నుంచి వెళ్తున్న టిప్పర్ లారీ, మురముళ్ళ నుండి వస్తున్న పల్సర్ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.