దరఖాస్తు గడువు పొడిగింపు: ఎంపీడీఓ

RR: ఫరూఖ్ నగర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం దుకాణాల సముదాయంలోని షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గడువు పొడిగించడం జరిగిందని ఎంపీడీవో బన్సీలాల్ అన్నారు. వేలంలో పాల్గొనేవారు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఎంపీడీవో, ఎంపీపీ ఫరూఖ్ నగర్ పేరుపై డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11 వరకు గడువు ఉందన్నారు.