మార్కెట్‌లో నేటి ధరల వివరాలు

మార్కెట్‌లో నేటి ధరల వివరాలు

MBNR: నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో 12,097 క్వింటాళ్ల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి రమేష్ కుమార్ తెలిపారు. వీటికి క్వింటాకు ₹2,813 ధర లభించిందన్నారు. దొడ్డు రకం వరికి ₹1,500 నుంచి ₹1,998 వరకు ధర పలికిందని చెప్పారు. మొక్కజొన్నకు ₹1,200 నుంచి ₹1,920 వరకు మార్కెట్‌లో ధర నమోదైందని వివరించారు.