ముదక్‌పల్లి ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే

ముదక్‌పల్లి ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే

NZB: మోపాల్ మండలం ముదక్‌పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాగుల దత్తు గౌడ్‌కు మద్దతుగా శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తోందని పేర్కొన్నారు.