వెంకటేశ్వర్లపల్లిలో పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలని డిమాండ్
BHPL: వెంకటేశ్వర్లపల్లిలో పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలని ఇవాళ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ సేవలకు 3KM నడిచి సుల్తాన్‌పూర్ వెళ్లాల్సి వస్తోందని, రెండు గ్రామాల ప్రజలతో గంటలు నిలబడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో పోస్టాఫీస్ ఏర్పాటుతో సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు తెలిపారు.