VIDEO: '30 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది'

కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలిలో 30 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన గ్రామంలో పర్యటించారు. గతంలో ఆయన 'పల్లెబాట' కార్యక్రమంలో స్థానిక ప్రజలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఈ చర్యలతో స్థానికులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు చెప్పారు.