'ప్రతి ఇంట్లోనూ ఓ విజయ్ ఉన్నాడు.. నన్ను ఆపలేరు'

'ప్రతి ఇంట్లోనూ ఓ విజయ్ ఉన్నాడు.. నన్ను ఆపలేరు'

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో TVK పార్టీ అధినేత విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాజకీయంగా నన్ను అణచివేయాలని చూస్తే సాధ్యం కాదు. CM గారు.. మీరు నన్ను నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. కానీ తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఉన్న 'విజయ్'ను మీరు ఆపలేరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TVK విజయం ఖాయం' అని ధీమా వ్యక్తం చేశారు.