లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ

KMR: బాన్సువాడ నియోజకవర్గంలోని 69 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసంలో శనివారం పంపిణీ చేశారు. మొత్తం రూ. 26,43,500 విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.