‘ఒకే వేదికపై 55 జంటలకు పెళ్లి’

KRNL: ఆదోని మండలం పెద్దహరివాణంలో శ్రీ గర్జిలింగేశ్వర స్వామి బండారు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం 55జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం చారిత్రాత్మకమని కురువ కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.