రేపు వాడపల్లి ఆలయంలో హుండీ లెక్కింపు

రేపు వాడపల్లి ఆలయంలో హుండీ లెక్కింపు

 కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో బుధవారం ఉదయం నుంచి ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.