PSR అరెస్టుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

PSR అరెస్టుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

AP: సీనియర్ IPS అధికారి PSR ఆంజనేయులు అరెస్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారు పీఎస్ఆర్ పై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చిందని, ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.