గ్రంథాలయ అధికారిని నియమించేది ఎప్పుడు..?
SKLM: నరసన్నపేట మండలం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిని నియమించకపోవడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో పదవీ విరమణ పొందిన అధికారి స్థానంలో 14 నెలలు గడిచినా కొత్త వారిని నియమించలేదు. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే అధికారిని నియమించాలని కోరుతున్నారు.