సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

WGL: గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ అన్నారు. గ్రామంలోని 5వ వార్డు ఎస్సీకాలనీలో రూ.5లక్షలతో నిర్మించబోతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని ఆయన కాంట్రాక్టర్‌కు సూచించారు.