'సమస్యను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించాం'
HYD: మీ డబ్బు-మీ హక్కులో భాగంగా 17న బాగ్ లింగంపల్లిలోని TGSRTC కళ్యాణ మండపం వద్ద జిల్లాస్థాయి శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు-మీహక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.