'కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు'

ADB: కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి ఆత్రం సుగుణక్క అన్నారు. గురువారం ఉట్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకల్లో సుగుణక్క పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులను సుగుణక్క-బుజంగారావు దంపతులు శాలువాతో ఘనంగా సన్మానించారు.