జలవనరుల పెరుగుదలపై సంతోషం వ్యక్తం చేసిన కలెక్టర్
అన్నమయ్య: జిల్లాలో గత నెలలో 3.4 మీటర్ల భూగర్భ జలాల పెరుగుదల సాధ్యమైనందుకు నీటిపారుదల శాఖ అధికారులను, సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం అభినందించారు. ఈ పెరుగుదల ఎండాకాలంలో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. మైస్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం కింద 9,10వ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిపై వారానికి 2 రోజుల పాటు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.