VIDEO: హన్మకొండ బస్టాండ్‌లో ప్రయాణికులతో రద్దీ

VIDEO: హన్మకొండ బస్టాండ్‌లో ప్రయాణికులతో రద్దీ

HNK: బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. దసరా పండుగ సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బస్టాండ్ మొత్తం ప్రయాణికులతో నిండిపోవడంతో బస్సుల కోసం పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. రద్దీని అదుపులో ఉంచేందుకు ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.