'హాస్టళ్ల వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి'

'హాస్టళ్ల వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి'

మంచిర్యాల జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంక్షేమ హాస్టల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్డెన్లు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు.