రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
KDP: పులివెందుల ఉలిమెల్ల రింగ్ రోడ్డులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో గంగ ప్రసాద్ (32) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు సీయోనుపురం ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.