ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు

KMR: నసురుల్లాబాద్ మండలంలో బీజేపీ అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ తోనే పట్టభద్రుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయి అన్నారు.