‘కిసాన్ కపాస్, యూరియా యాప్‌లను రద్దు చేయాలి’
NLG: తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నరసింహ కిసాన్ కపాస్, యూరియా యాప్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ఒప్పందాలను కూడా రద్దు చేయాలని వారు నినాదాలు చేశారు.