గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

HNK: హసన్‌పర్తి మండలం పలివెల్పుల గ్రామ శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య బుధవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ స్టోర్ రూమ్‌ను పరిశీలించి కోడిగుడ్లు, బియ్యం పప్పుల నిలువ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు మరింతగా మెరుగు పరచాలని ఆదేశించారు.