నర్సీపట్నంలో ఆర్టీసీ కార్మికుల నిరసన
AKP: నర్సీపట్నం ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల మీద పోరాడుతున్నప్పటికీ ఆర్టీసీ డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని ఎన్ఎంయు డిపో చైర్మన్ నారాయణ పేర్కొన్నారు. డిపో కార్యదర్శి ఆర్‌వి రమణ మాట్లాడుతూ శ్రీ శక్తి పథకం వల్ల ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.