VIDEO: రాత్రి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న MLA
HNK: పరకాల మండలం నాగారం గ్రామంలో MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇవాళ రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా MLA ఓ చిన్నారికి బొట్టు పెట్టి ఆమెతో కాసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.