ఎమ్మెల్యే స్వగ్రామంపై అందరి చూపు
BHPL: ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించడంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామం బుద్దారంపై అందరి చూపు పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా విడిదినేని శ్రీలత, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొముర్రాజు అమృత నామినేషన్ వేశారు. 12 వార్డు స్థానాల్లో 9 ఏకగ్రీవమయ్యాయి. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉండటంతో ఏకగ్రీవం కావాలని రెండు పార్టీలూ కృషి చేస్తున్నాయి.