'వారికి గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలి'

బిచ్చగాళ్ల పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమైతే అది పరిపాలన లోపమే అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఆయా కేంద్రాల్లో యాచకులు గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం కమిటీలు వేయాలని, వారికి ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది.