భువనగిరిలో ఉచిత మెగా వైద్య శిబిరం
BHNG: భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 128వ ఉచిత మెగా వైద్య శిబిరం పహాడీ నగర్ శ్రీ ఆర్కే హాస్పిటల్ నందు నిర్వహించారు. స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. వైద్యా శిబిరంలో బీపీ షుగర్, న్యూరోపతి, బీఎండీ, తదితర పరీక్షలు నిర్వహించారు.