'ప్రజలను పట్టించుకునే నాధుడు కరువు'
MBNR: ప్రజా పాలనలో ప్రజలను పట్టించుకుని నాథుడు కరువయ్యాడని బీజేపీ మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు మూస నరసింహ అన్నారు. బుధవారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు అవినీతి మరకలను అంటిస్తుందన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాథుడు లేడన్నారు.