గృహ రుణాల విలువ రూ.9లక్షల కోట్లు: SBI
ఈ ఏడాది నవంబరులో గృహ రుణాల విలువ రూ.9 లక్షల కోట్లను అధిగమించినట్లు SBI ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. రిటెయిల్, వ్యవసాయం, MSME(RAM) విభాగంలో జోరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణాల వృద్ధి 14 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం రుణాల్లో RAM వాటా 67% కాగా, సెప్టెంబరులో ఇవి రూ.25 లక్షల కోట్ల మైలురాయిని మించాయి.