యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్
ASF: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రెబ్బెన మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుదరి సాయి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.