VIDEO: భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు అభిషేకం
KDP: వేంపల్లిలోని సాయి నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఇందీవర శ్యామ్ నేతృత్వంలో శ్రీ దుర్గమ్మకు పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతి రోజూ భక్తుల సహకారంతో దుర్గమ్మకు విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.