పులి కోసం 70 మంది సిబ్బందితో గాలింపు

పులి కోసం 70 మంది సిబ్బందితో గాలింపు

KKD: శంఖవరం మండలం మండపం నూకాలమ్మ ఆలయ సమీపంలో పులి పొంచి ఉన్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. తాళ్లపాలెం గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో పులి ఉండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకునేందుకు 70 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే సిగ్నల్స్ లేని దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి కదలికలను గుర్తించడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు.