'ఆరోగ్య బీమా జీవితానికి ధీమా'
NRPT: ఆరోగ్య బీమా చేసుకోవడం ద్వారా జీవితానికి ధీమా లభిస్తుందని అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో హోం గార్డులకు ప్రైవేట్ బ్యాంకుల ఆధ్వర్యంలో బీమాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగినా, ప్రమాదవశాత్తు మృతి చెందినా నష్టపరిహారం అందుతుందని చెప్పారు.