ప్రమాదాలకు నిలయంగా నడిరోడ్డుపై బోర్డులు
SRPT: జిల్లా కేంద్రంలో రహదారి నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రోడ్డుపైనే టిఫిన్ సెంటర్ల బోర్డులు, బల్లలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేక పాదచారులు నానా అవస్థలు పడుతుండగా, ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.