మహాదేవుని జెండా ప్రతిష్టాపన

నిర్మల్ జిల్లా బైంసా పట్టణం కిసాన్ గల్లీలోని మహాదేవ్ మందిరంలో మహాదేవుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహదేవుని ధ్వజ స్థంబానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని మహాదేవుని జెండాను ప్రతిష్టిస్తామని కిసాన్ గల్లీ అధ్యక్షుడు కుంట రాజలింగు తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లీ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.