ఫేక్‌ న్యూస్‌ ప్రచారంపై తుమ్మల ఆగ్రహం

ఫేక్‌ న్యూస్‌ ప్రచారంపై తుమ్మల ఆగ్రహం

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS అభ్యర్థి సునీతను గెలిపించాలంటూ కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు వస్తున్న వార్తలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజామోదంతో గెలవాలి కానీ, ఇలా ఫేక్‌ న్యూస్‌తో కాదని హితవు పలికారు. ఫేక్ న్యూస్‌ను నమ్ముకున్న BRSను జూబ్లీ ఓటర్లు తరిమి కొడతారన్నారు.