వంతెన నిర్మాణ పనులు ప్రారంభం
WNP: మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగుపై హై లెవెల్ వంతెన, అప్రోచ్ నిర్మాణ పనులకు రూ.6 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. అట్టి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు పనులను పరిశీలించి మాట్లాడారు. వాగుపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషితో నిధులు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు.