బుట్టాయిగూడెంలో జనవాణి కార్యక్రమం
W.G: బుట్టాయిగూడెంలో ఇవాళ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు పాల్గొని ప్రజల నుంచి వినతులను , ఫిర్యాదులను స్వీకరిస్తారని వివరించారు. మండల పరిధిలోని గ్రామాలు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్జీలు, ఫిర్యాదులు ఉంటే తెలియపరచవలసిందిగా కోరారు.