'ఆర్టీసీ ప్రగతిలో సిబ్బంది పాత్ర కీలకం'
WNP: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధిలో ఆర్టీసీ ఉద్యోగులు భాగస్వాములు కావాలని స్థానిక డిపోలు విజయవంతంగా నడవడానికి సహకారం అందించాలని హైదరాబాద్ జోన్ ఈడీ ఖుస్రుషా ఖాన్ కోరారు. ఆయన వనపర్తి బస్టాండ్, డిపోను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ప్రధానమని, బస్సుల కండీషన్‌ను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలన్నారు.