'ధర్మం కోసం పాటుపడే వారు బీజేపీలో ఉన్నారు'
NGKL: దేశం, ధర్మం కోసం పాటుపడే కార్యకర్తలు బీజేపీలోనే ఉన్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజి ఆచారి అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఒక్క భాజపాలోనే ఉంటారన్నారు. ప్రతి మూడేళ్లకొకసారి నిర్వహించే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.