"స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి"
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్‌లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.