అల్వాల్‌లో చలివేంద్రాల ఏర్పాటు
MDCL: వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సేవా పరమోధర్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు అభినందనీయమని అల్వాల్ సీఐ ప్రశాంత్ తెలిపారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ గైక్వాడ్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.