VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: అనపర్తి మండలం కొప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా చేయకపోగా.. వ్యాపారాత్మక ఆలోచనలు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపించారు.