VIDEO: డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తుల ఆట కట్టు

ELR: చాట్రాయి మండలంలోని పలు గ్రామాలలో అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు పోలీసు యంత్రాంగం సోమవారం డ్రోన్ కెమెరాలను వినియోగించింది. ఇందులో భాగంగా నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పర్యవేక్షణలో చాట్రాయి ఎస్సై పీ.రామకృష్ణ సిబ్బందితో కలిసి పోతనపల్లి గ్రామంలో సారా శిబిరాలపై దాడులు నిర్వహించారు. సారాకు వినియోగించే డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు.